సింగరేణి బాయి బాటలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

0
2

మంచిర్యాల జిల్లా : టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని,పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని .

డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని,నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసిందని,ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదని,సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.