పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.|

0
1

మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి చెందిన ఓ బాధితుడు తన కుమారుడిని భుజాలపై మోసుకుని వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావడం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే న్యాయం చేసి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరాడు.