మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని వాసవీ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానిక నివాసితులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువ వ్యవస్థను ఆధునీకరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని నివాసితులు కోరారు.
అలాగే రహదారుల వెంట పెరిగిన చెట్ల కొమ్మలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, వాటిని కత్తిరించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికుల సమస్యలను శ్రద్ధగా విన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, వాటిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పౌర సదుపాయాలు అందించడం తమ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, సాజిద్, యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










