“విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.”|

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పరామర్శించారు.

బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆయన వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి బాధితులకు తగిన నష్టపరిహారం త్వరగా అందేలా తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, దేవయ్య, రాజు, విజయ్ శేఖర్, జనార్దన్, ప్రకాష్ గౌడ్, మైవన్, మురళి గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతుని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

#Sidhumaroju

Alwal