నకిలీ ఆధార్ నమోదుపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కఠిన హెచ్చరిక|

0
3

నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు…

జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్

హెచ్చరిక

అనంతపురం, జూన్ 17:

ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పారదర్శకంగా, వేగవంతంగా అన్నిరకాలసేవలుఅందించాలని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ సూచించారు.

బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు చంద్రా హాస్పిటల్ పక్కన పి. ఆర్. రెసిడెన్సి భవనంలోనూతనంగాఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజలకు,వృద్ధులు ,మహిళలు విద్యార్థులకు మరియు గ్రామీణ ప్రాంతాల వారికి ఆధార్ సేవలను బాధ్యతా

యుతంగా అందించాలని తెలిపారు. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాల తో నకిలీ ఆధార్నమోదుకుప్రయత్నించినప్పుడు అట్టివారిని గుర్తించి

ఆ కేసులను తన దృష్టికి తీసుకురావాలని అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేంద్రం ఏర్పాటు వలన ఆధార్ సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

అత్యాధునిక డిజిటల్ సేవలు ఇకపై అనంతపురం నగరంలోని ఈ కేంద్రంలో ప్రజలకు చేరువగా ఉంటాయని తెలిపారు.