యువకుల్లో మార్పు కోసం SI ప్రయత్నం.. వివాదానికి దారితీసిన ఘటన.|

0
0

నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెలో గంగ జాతర సందర్భంగా గొల్లపల్లికి చెందిన రెడ్డిశేఖర్ వర్గం, నాగులయ్యగారిపల్లికి చెందిన పునీత్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి. యువకుల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతో నిమ్మనపల్లె ఎస్‌ఐ వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం గాయపడిన పునీత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన బుధవారం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.