పాణ్యంలో ఘనంగా ‘సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ|

0
0

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో “సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్ సభ” ఘనంగా నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరియు పాణ్యం నియోజక వర్గం అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారు మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా..

ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ

పాణ్యం నియోజక వర్గంలో industrial corridor ఏర్పాటు కావటం జిల్లా అదృష్టంగా భావిస్తూ అన్ని పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు

గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ దేశంలో 24వ స్థానంలో ఉండేది.. దానిని కేవలము రెండు సంవత్సరాలలోనే ఏపీ పంచాయతీ రాజ్ శాఖను మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది అని తెలియచేశారు

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి హామీల అమలు విషయంలో ముందుకు దూసుకెళ్తుంది అని వివరించారు

ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజక వర్గం MLA శ్రీమతి గౌరు చరిత గారు బీజేపీ జనసేనా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..