రెండు తలలతో గొర్రెపిల్ల.. రెండు గంటల్లోనే మృతి|

0
1

విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో శనివారం రాత్రి రెండు తలలతో గొర్రెపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. పుట్టిన రెండు గంటల వ్యవధిలోనే గొర్రె పిల్ల మరణించినట్లు యజమాని రాములు తెలియజేశారు. ఇలాంటి పిల్లను తను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. జన్యు లోపంతో పుట్టిన ఇలాంటివి బతకడం కష్టమని పశు వైద్యుడు ప్రసాద్ చెప్పారు.

#Boiena Rajesh