మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం|

0
0

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సమస్యల స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలతోనే జిల్లా కేంద్రానికి రావాలని తెలిపారు.