👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కొనసాగుతోన్న “స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో ”
జిల్లాలో రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేపట్టిన “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో ” కార్యక్రమం కొనసాగుతోంది.
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తమ సిబ్బందితో అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు, తదితర వాహనాల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు.
లారీలు, కార్లు, వ్యాన్లు, బస్సులు, తదితర వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు పోలీసు అధికారులు సూచించారు.










