ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్|

0
0

జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న నైట్ పెట్రోలింగ్..

జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాలతో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల్లో భద్రత భావాన్ని పెంపోదించడం కోసం ప్రతీ రోజు నైట్ పెట్రోలింగ్ విధులు కొనసాగుతున్నాయి. లాక్డ్ హౌస్ ( తాళాలు వేసిన ఇళ్లు ) వద్ద దొంగతనాలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచారు.

కింది స్థాయి సిబ్బంది నుండీ ఎస్సైలు, సి.ఐ లు, డీఎస్పీల దాకా రాత్రి వేళ మరింత అప్రమత్తత తో గస్తీ విధులు, పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. బీట్ తనిఖీ అధికారులు, సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి రవాణా వివరాలు, కొత్త వ్యక్తుల వివరాలు ఆరా తీసి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. బీట్ తనిఖీ అధికారులు తరచూ బీట్ పాయింట్స్ తనిఖీ చేసి, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేలా చేస్తున్నారు.

లాడ్జి రూమ్స్ లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

లాడ్జిలో ఉంటున్న వారి అధార్ కార్డు పరిశీలించి వివరాలు సేకరించారు.

లాడ్జిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానాస్పద/కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీశారు. పాత నేరస్తులు, అనుమానితులు, చెడునడత కలిగిన వారి పై నిఘాను పెడుతున్నారు. మొబైల్ చెక్ డివైస్ ద్వారా అనుమానితులను చెక్ చేస్తున్నారు.