పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి ఏనుగు పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. గోగులమ్మ వంక నుంచి వచ్చిన ఏనుగు కోటపల్లి వద్ద మామిడి చెట్లను ధ్వంసం చేసి, పశుగ్రాసం, పైపులను తొక్కి విరిచివేసిందని రైతులు గోపి, యుగంధర్ తెలిపారు. అనంతరం ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు# కొత్తూరు మురళి.










