పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి|

0
0

అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటుండగా వర్షం కురిసింది. తల దాచుకోవడానికి ఐచర్ వాహనం కిందకు వెళ్ళగా, డ్రైవర్ బండిని ముందుకు కదిలించడంతో వెనుక చక్రాల కింద నలిగిపోయింది. స్థానికులు ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.