టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు.
ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న దర్శి పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు యాదగిరి వాసు గారి సతీమణిని శనివారం సాయంత్రం సందువారిపాలెంలోని వారి నివాసంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.










