యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ పల్లెనిద్ర, పిల్లలతో ముచ్చట్లు|

0
1

“యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు”

గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు.

పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా యెర్రారెడ్డిపాలెం గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గారు, శనివారం ఉదయం ఎమ్మెల్యేతో కలిసి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

“ముస్తాబు” కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, బాగా చదువుకుంటేనే జీవిత లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.