అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.|

0
4

మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు మృతి చెందాడు. గత ఐదు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే అధికంగా మద్యం సేవిస్తున్న నారాయణ, ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో మదనపల్లె వద్ద ఆయన మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.