మెట్రో నిధుల కోసం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ|

0
1

హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణ‌వ్‌ గారితో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారితో పాటు అశ్వినీ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.

 

సమావేశం అనంత‌రం ముఖ్యమంత్రి గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైల్వే మంత్రి గారితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయ‌న్నారు. ఈ అంశంపై కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం భేటీ అవుతామ‌ని వెల్ల‌డించారు.