మత్స్యకారులకు మంత్రి లోకేష్ భరోసా
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలో మంత్రి నారా లోకేష్ పర్యటించి, మత్స్యకారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. స్వయంగా వారితో కలిసి పడవలో ప్రయాణించి, వల వేసి చేపలు పట్టారు. వారి జీవన స్థితిగతులు, సమస్యలు మరియు ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
డీజిల్ సబ్సిడీని రూ.30కి పెంచాలని, బోట్లు, వలలపై రాయితీతో పాటు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్, పక్కా ఇళ్లు నిర్మించాలని మత్స్యకారులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, ప్రజాప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.










