“*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*”
కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి మంగళవారం పరిశీలించారు.
ముఖ్య విశేషాలు:
⚓ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
💰 రూ. 441 కోట్ల వ్యయంలో కేంద్ర వాటా ₹150 కోట్లు కాగా, మిగిలిన అధిక వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
🏖️ హార్బర్‌తో పాటు ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, త్వరలోనే ఎయిర్‌పోర్ట్, హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.










