జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ – రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీలో మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్రకు సభ్యుడిగా స్థానం లభించింది. ఈ సందర్భంగా అడపా సురేంద్ర, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.









