పోలీస్ స్టేషన్ అంటే ఒకప్పుడు భయం, ఆందోళన ఉండేవి. కానీ తెలంగాణలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం ఆ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను ఓపిగ్గా వింటూ,తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు అధికారులు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్న చొరవ సమాజంలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ.. కేవలం లా అండ్ ఆర్డర్ కాకుండా, సమాజంలో ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఖాకీ వర్ది నిలుస్తోంది. ఈ స్నేహపూర్వక వైఖరి పోలీసులపై ప్రజల్లో గౌరవాన్ని రెట్టింపు చేసింది.










