మహిళల రక్షణకు ‘దిశ’: ఏపీ పోలీసుల అండ|

0
1

ఆపదలో ఉన్న మహిళలకు మేమున్నామంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ‘దిశ’ యాప్ ద్వారా కొండంత అండగా నిలుస్తోంది. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు కేవలం ఫోన్ గట్టిగా ఊపితే చాలు.. నిమిషాల్లోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. జీపీఎస్ ఆధారంగా లొకేషన్‌ను గుర్తిస్తూ

, ఐదు నుండి పది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటున్నాయి. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా వేగంగా విచారణ పూర్తి చేస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పు మహిళల్లో ఒక బలమైన భరోసాను, ధైర్యాన్ని నింపింది.