గుర్తుతెలియని వాహనం ఢీ.. బైక్ రైడర్ పరిస్థితి విషమం.|

0
1

మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్ రెడ్డి(50) తీవ్రంగా గాయపడ్డారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, కొండామర్రిపల్లి సమీపంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.