మాదకద్రవ్యాలకు నో – జీవితానికి ఎస్: కళాశాలలో అవగాహన సదస్సు|

0
0

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో గురువారం ‘మాదకద్రవ్యాలకు నో – జీవితానికి ఎస్’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లతా హాస్పిటల్ అధినేత, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి.రాజ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలనే మాయాజాలంలో చిక్కుకుంటే ఆరోగ్యం, విద్య, కుటుంబం, భవిష్యత్తు నాశనమవుతాయని హెచ్చరించారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సులో విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.