X
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) కస్టడీ డెత్, అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ బృందం మంగళవారం ఐదు గంటల విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది. కోర్టు జులై 8 వరకు (14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలింపు ప్రక్రియ చేపట్టారు.
మే 9న సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆధారాలు మాయం చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్ తొలగించి, మృతదేహాన్ని దహనం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఐజీ రవిప్రకాశ్ నేతృత్వంలోని సిట్ బృందం హత్య, ఆధారాల తారుమారు తదితర కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తోంది.









