తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థినులు హర్షిత, టి.నవ్య, అఫ్రీన్ ఖాన్, గాయత్రి, ఏ.నవ్యలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జిల్లా వ్యవస్థాపకులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.
వంద మార్కులు సాధించేలా కృషి చేసిన పుంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జీ వి రమణను కండువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుగుణ ముత్యాలు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










