పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన|

0
0

పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సేవాలాల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 8 తండాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం, సమాజ సంస్కర్త అయిన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనలో భాగంగా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని కమిటీ ప్రతినిధులు తెలిపారు

#కొత్తూరు మురళి.