మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం సమావేశం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా, ఓటర్లు తమ నివాసానికి సమీపంలోనే ఓటు వేయగలిగేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,334 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 90 కొత్త కేంద్రాలను ప్రతిపాదించారు. హేతుబద్ధీకరణ అనంతరం మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,424కు చేరనుంది.










