మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 2026–27 పోస్టర్‌ను ఆవిష్కరించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులు జాతీయ స్థాయి డిజిటల్ సైన్స్ టాలెంట్ పరీక్షల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివీఎం కోఆర్డినేటర్ వరప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










