మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా ఒక సందేశంలో పేర్కొన్నారు.
♦️మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను విచ్చిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అక్రమ రవాణాను అరికట్టేందుకు అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు.
♦️డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు.










