నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు|

0
0

🔹నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి చేయించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. పాషా మాట్లాడుతూ, MSME ద్వారా చేతివృత్తుల వారు ఎటువంటి తాకట్టు లేకుండా రుణాలు పొందే విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు, స్వయం ఉపాధి అవకాశాల గురించి వివరించారు.MSME ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.