‘ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జేజే నగర్, రామ్నగర్, జానకీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
బూత్ లెవల్ అధికారులతో కలిసి పంపిణీ తీరును సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితాలో పేరు లేని వారు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు, వివరాల్లో మార్పులు లేదా సవరణలు చేయించుకోవాల్సిన వారు ఎన్నికల సంఘం సూచించిన ఫారాలను సకాలంలో సమర్పించాలని ఆమె కోరారు.
ప్రజలు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
#Sidhumaroju
Alwal










