అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే యువతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తూ.గో జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన ఈమె, విజయవాడకు చెందిన మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది.
2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుని, కొద్దిరోజులకే మాయమైంది. ఇటీవల కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు










