కడప నగర పరిధిలోని పాలెంపల్లె బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










