గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన|

0
1

​విజయవాడలో గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. దీనికి సంబంధించి
​నోటీసులు: పోలీసుల తీరును మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించిన కమిషన్, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ డీజీపీ మరియు విజయవాడ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
​నివేదిక గడువు: కృష్ణలంక పీఎస్ సిబ్బంది సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేయడం వల్లే ఆయన మరణించారని వచ్చిన ఫిర్యాదులపై, 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
​విచారణాంశాలు: నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి దహనం చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. నిందితుడైన సీఐ నాగరాజుపై తీసుకున్న చర్యలు, సిట్ (SIT) విచారణ స్థితిగతులు, సీసీటీవీ ఫుటేజీ రికవరీ వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది.
​బాధితుడి కుటుంబానికి భద్రత: బాధితుడి తల్లికి భద్రత, కుటుంబానికి పరిహారంపై కూడా కమిషన్ వివరాలను కోరింది.