కొల్లిపరలో వృద్ధుడిని బెదిరించి రెండు బంగారు ఉంగరాలు, మొబైల్ ఫోన్ దోచుకెళ్లిన ఘటనను పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2.40 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించిన తెనాలి రూరల్ సీఐ ఎస్కే నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్.సి. ప్రసాద్ మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ బి. జనార్దన్ రావు అభినందించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు.










