ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా జూన్ 27న గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భారీ వాహనాలకు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్లు, బస్సులు తదితర చిన్న వాహనాలకు మళ్లింపు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు, వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.










