కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ

0
1

కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని, రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ప్రతిమా చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు , “సే నో టు ట్రక్స్”గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు”, *మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి* వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి, పీటీ తిరుపతి మరియు అకాడమీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.