బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్త్రావేణి రాజన్న

0
0

🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి  స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారు అధికారికంగా ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.