శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి… 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

0
0

శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి… 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ పామూరు ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో పామూరులోని శ్రీనివాస లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.18,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జూదం, బెట్టింగ్ మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.