హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, అందజేసి అభినందనలు తెలిపారు,రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు మరింతగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,రగ్బీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించిన ముఖ్యమంత్రి, ఈ లీగ్ ద్వారా దేశవ్యాప్తంగా రగ్బీ క్రీడకు మరింత ఆదరణ లభిస్తుందని అన్నారు.
ముగింపు వేడుకలో మెగా స్టార్ చిరంజీవి,మృనల్ ఠాకూర్, పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు , సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి , కోచ్లు, అధికారులు , క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










