అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల నిర్వహణ, విధుల తీరును పరిశీలించి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పనితీరుపై సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్సై అన్సర్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.










