ఆర్టీసీ బస్సు కండక్టర్ తీరుపై ప్రయాణికుల ఆరోపణలు.|

0
0

మదనపల్లె–తంబళ్లపల్లి ఆర్టీసీ బస్సు ఉదయం 6:50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, కండక్టర్ నాగమణి తరచూ 6:25 గంటలకే వెళ్లిపోతోందని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో ఉపాధ్యాయులు, ప్రభుత్వ నర్సులు, వైద్యులు విధులకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఆదివారం కారణం అడగగా కండక్టర్ దురుసుగా స్పందించి వాగ్వాదానికి దిగినట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.