మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.|

0
0

మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 15 మంది కూలీలు స్వల్ప గాయాలపాలయ్యారు. తట్టివారిపల్లెలో భవన నిర్మాణ పనులు ముగించుకుని నీరుగట్టుపల్లిలోని తమ నివాసానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.