పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తెనాలిలోని ప్రసిద్ధ క్షేత్రమైన వైకుంఠపురం దేవస్థాన ఆవరణలో పవిత్రమైన పంచవటి వృక్షాలను నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ గతి విధి జిల్లా సంయోజక్ నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో మర్రి రావి, వేప ఉసిరి మారేడు తదితర పవిత్ర వృక్షాల మొక్కలను నాటినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో వి అనుపమ ధర్మకర్తల మండల చైర్మన్ ఇదర పూర్ణచంద్రరావు ట్రస్టు బోర్డు సభ్యులు మరియు పలువురు పర్యావరణ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వృక్ష సంపదలను పెంపొందించేందుకు నాగరాజు చేస్తున్న నిరంతర కృషిని హాజరైన అతిథులు ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులోనూ ఇలాంటి హరిత కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు










