కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రు జయంతి వేడుకలు. తెనాలి.

0
2

తెనాలి..మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్లాల్ లాల్ నెహ్రూ 137 వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు,నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్  నెహ్రూ చేసిన సేవలు దేశాభివృద్ధికి చేసిన సంస్కరణలను కొనియాడారు..నెహ్రూ గొప్పతనాన్ని, పిల్లలంటే ఆయనకు ఉన్న ప్రత్యేక ప్రేమను వివరించారు. పిల్లల దేశ భవిష్యత్తుకు పునాదులు అని వారి ఉన్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నెహ్రూ కొనియాడేవారు.