“11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల”
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన ‘నరేంద్ర విజయం’ పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఇలాంటి పుస్తకాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు మరింత విస్తృతంగా చేరుతాయని అన్నారు. ఈ గ్రంథం రూపకల్పనలో గీతా మూర్తి చేసిన కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#Sidhumaroju










