సోమలలో అపరిశుభ్రత: ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి?|

0
0

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు వచ్చి భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ దుర్గంధంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, బ్యాంక్ వంటి కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మంగళవారం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని వారు ఆశిస్తున్నారు

#కొత్తూరు మురళి .