🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఓ పేద కుటుంబం ఇంట్లోపలికి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఆయన, తక్షణమే స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, హౌసింగ్ ఏఈ తో మాట్లాడి వారిని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. కౌన్సిలర్ కార్తీక్ గారితో కలిసి అధికారి ఆ ఇంటిని పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ… అర్హత ప్రమాణాల మేరకు బాధిత కుటుంబానికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విపత్కర సమయంలో వేగంగా స్పందించి తమకు అండగా నిలిచిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.










