అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.|

0
1

అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన, జిల్లాలో మొత్తం 12,32,439 మంది ఓటర్లకు గాను, 12,00,996 మందికి (97.38%) ఎన్నికల ఫారంల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తూ ఓటరు జాబితా ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.